Advertisement
Google Ads BL

రావణ్ గా సూపర్ స్టార్


సౌత్ నెంబర్ వన్ హీరో రజినీకాంత్ భాషా, అరుణాచలం, నరసింహ లాంటి సినిమాల్లో ఆయన స్టయిల్ ని ఆయన మ్యానరిజాన్ని కాని అభిమానులు బాగా లైక్ చేసారు. రజినీకాంత్ అలా అలా కాలు కదిపితేనే చాలు ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. రజినీకాంత్ చెప్పే డైలాగ్, ఆయన స్టయిల్ గా భుజాన వేసుకునే టవల్, ఆయన తాగే చుట్ట.. ఇలా ఆయన ఏది చేసిన స్టయిల్ గా ఉంటుంది. అలాంటి రజినీకాంత్ ని రావణ్ పాత్రలో చూడాలని ఉంది అంటున్నారు ఓ టాప్ రైటర్. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల కథను అందించిన నెంబర్ వన్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఈమధ్యన వచ్చిన ఓ షో లో రజినీకాంత్ కి కథ రాయాలంటే ఎలాంటి కథ రాస్తారు అనగానే రావణ్ కథ. అది కూడా రజినీకాంత్ రావణ్ పాత్రలో ఉండే కథని రాయొచ్చు అని చెప్పారు.

Advertisement
CJ Advs

అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ రావణ్ పాత్రలో చూపిస్తూ కథ అల్లడం అని ఆయన చెప్పిన దానికి మీనింగ్. ఇప్పటివరకు నెగెటివ్ షేడ్స్ కానీ, ఇలాంటి పాత్రలులో కానీ రజినిని ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ రావణాసురుడిగా రజినీకాంత్ ని ఊహించుకుంటే గూస్ బంబ్స్ వస్తున్నాయి. నిజంగానే విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా రజినీకాంత్ ని రావణ్ అవతార్ లో చూస్తే ఫాన్స్ ఎందుకు ఆగుతారు. మరి ఈ రావణ్ పాత్ర రజిని గనక చేస్తే.. మాములుగా ఉండదు.. సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోవడమే. అది జరిగే పనే అంటారా? ఎందుకంటే రజినీకి సినిమాలు చెయ్యాలని ఉన్నా ఈమధ్యన ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ చెప్పడం చూస్తుంటే రజిని సినిమాలకు బై బై చెప్పే ప్లాన్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

Superstar as Ravan:

Superstar Rajinikanth as Ravan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs