Advertisement
Google Ads BL

సీబీఎస్ఈ 12th ఎగ్జామ్స్ రద్దు


కరెక్ట్ గా ఏప్రిల్, మే లో జరగాల్సిన పరిక్షలన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. తెలంగాణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th ఎగ్జామ్స్ ని రద్దు చేసి.. సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలని వాయిదా వేశారు. ఇక ఏపీలో మాత్రం 10th  కానీ, ఇంటర్ కానీ రద్దు చేసేది లేదు.. పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఇక సీబీఎస్ఈ 10th, 11 వ తరగతి పరీక్షలని రద్దు చెయ్యగా... 12వ తరగతి పరీక్షలని వాయిదా వేసింది. అయితే జూన్ లో 12వ తరగతి పరిక్షలని ఎప్పుడు నిర్వహించాలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.

Advertisement
CJ Advs

జూన్ వచ్చినా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యుల అమలుతో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు  చెయ్యాలని సుప్రీం కోర్టుకి విద్యార్థులు పిటిషన్స్ పంపడం, సెకండ్ వేవ్ ఉధృతి తగ్గకపోవడంతో ఇప్పుడు సీబీఎస్ఈ బోర్డు 12th ఎగ్జామ్స్ ని రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సాయంత్రం జరిగిన సమీక్ష సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది బోర్డు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని ఆ సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

CBSE 12th exams cancelled:

CBSE Class 12 board exams 2021 cancelled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs