Advertisement

అన్షి నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది: చిరు


అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు అయ్యాయి. ఎంతో మంది పేదలకు ఆక్సిజన్ బ్యాంకుల సేవలు అందుతున్నాయి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఓ చిన్నారి ఆలోచన మరింత ఇన్స్‌పిరేషన్ ఇచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

Advertisement

పి.శ్రీనివాస్, శ్రీమతి హరిణి గార్ల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్ 1న తన బర్త్ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ఈ సందర్భంగా తను ఏమంటోందంటే..తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినపోయాను. అన్షి చూపి స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.  భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో తెలియజేశారు.

Chiruoverwhelmed by a little girl support:

 Chiranjeevi overwhelmed by a little girl support
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement