Advertisement
Google Ads BL

పూజమ్మా నువ్వు సూపర్


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ లో ఉన్న పూజ హెగ్డే అటు బాలీవుడ్ ఇటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు భాషలతోనూ పూజా చేతినిండా సినిమాలతో తీరికలేని పూజ హెగ్డే మొన్నీమధ్యనే కోవిడ్ బారిన పడి కోలుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన పాత ఫొటోస్, కొత్త ఫొటోస్, వంట చేస్తున్న పిక్స్ ని పోస్ట్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటున్న పూజ హెగ్డే తాజాగా చేసిన పని చూసిన నెటిజెన్స్ పూజమ్మా నువ్వు సూపరమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అంటే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న ఇండియాలో లాక్ డౌన్, కర్ఫ్యూ అంటూ నానా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలు కొకొల్లలు. తిండి లేక, చెట్లకింద ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే లాక్ డౌన్ తో సమస్యల్లో ఉన్న పేద కుటుంబాలకు పూజ హెగ్డే తన వంతు సహాయం చేసి అండగా నిలిచింది. దాదాపుగా 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకుల్ని అందించి.. వాట‌న్నింటిని త‌నే స్వ‌యంగా ప్యాక్ చేసిన వీడియో అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూజా మాత్రమే కాదు సెలబ్రిటీస్ తమ వంతుగా ఆక్సిజెన్ సిలిండర్లు అందించడం, పేద కుటుంబాలకు ఆర్ధిక సహాయం చెయ్యడం వంటివి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆ లిస్ట్ లో పూజ హెగ్డే కూడా చేరింది. 

Pooja Hegde arranges food a month rations :

Pooja Hegde arranges food a month rations for a 100 families
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs