Advertisement
Google Ads BL

ప్రభాస్ తో మరో బాలీవుడ్ హీరో


ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఇండియా ని చుట్టేస్తున్నాడు. బాహుబలి, సాహో అంటూ బాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకున్నాడు. సాహో సినిమా ఏ భాషలో ఎలా ఉన్నా.. నార్త్ లో కలెక్షన్స్ కొల్లగొట్టేసింది. ఆ ధైర్యంతోనే ప్రభాస్ వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేసి బాలీవుడ్ హీరోలకే షాకిచ్చేసాడు. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ అశ్విన్ ప్రాజెక్ట్ లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాధేశ్యామ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేద్దామంటే కరోనా అడ్డం పడుతుంది. మరోపక్క ఆదిపురుష్, సలార్ షూటింగ్ ఒకేసారి చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీ ని దసరాకి మొదలు పెట్టె సూచనలున్నాయి.

Advertisement
CJ Advs

ఇక తర్వాత ప్రభాస్ వార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రెండో బాలీవుడ్ మూవీకి కమిట్ అవ్వబోతున్నాడనే టాక్ ఉండగా.. అది నిజమే సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ కటౌట్ కి సరిపోయే యాక్షన్ కథని రెడీ చేస్తున్నాడట, వార్ కి మించి.. హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. వార్ యాక్షన్ సన్నివేశాలే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని అందరూ సిద్దార్థ్ ఆనంద్ ని మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో చెయ్యబోయే సినిమా వార్ కి మించి ఉంటుంది అని.. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి పోటీగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడట. 

అంటే ప్రభాస్ తో ఢీ అంటే ఢీ అనే కేరెక్టర్ అయినా, లేదంటే దోస్త్ లుగా అయినా ఈ సినిమాలో ప్రభాస్ తో మరో బాలీవూడ్  స్టార్ హీరో జత కడతాడని.. ఈ సినిమాలో ప్రభాస్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని, దీనిలో యాక్షన్స్ సీన్స్ ని బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చేలా చూపించబోతున్నాడట సిద్దార్థ్. 

Prabhas Joins Siddharth Anand:

Siddharth Anand gets in talks with Prabhas over an action thriller movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs