Advertisement
Google Ads BL

బండ్ల బ్యానర్ లో పవన్ వారసుడి ఎంట్రీ


పవన్ కళ్యాణ్ అంటేనే ఫాన్స్ లో పిచ్చ క్రేజ్ ఉంటుంది. మెగా ఫ్యామిలిలో ఏ హీరో కి లేని క్రేజ్ ఒక్క పవన్ కే ఉంటుంది అంటే నమ్మాలి. ఆయన సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చి మళ్లీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చినా పవన్ ని ఫాన్స్ నెత్తిన పెట్టుకున్నారు. అంతలా ప్రేమించే పవన్ వారసుడు అకీరా అంటే మరింత క్రేజ్ ఫాన్స్ కి ఉంటుంది. అకీరా ఎక్కడ, ఎప్పుడు కనబడినా ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తో దిగిన ఓ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అకీరా నందన్ కూడా వెండితెరకు ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుసు. కానీ అది ఎప్పుడో తెలియక ఫాన్స్ కాస్త కన్యూజ్ అవుతున్నారు అంతే.

Advertisement
CJ Advs

ప్రస్తుతం మ్యూజిక్ లో ప్రావీణ్యం, పొందుతున్న అకీరా ని హీరో అంటూ బండ్ల గణేష్ సంబోధించడం చూస్తుంటే పవన్ కొడుకు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి ఆట్టే సమయం పట్టేలా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీని రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తాడని అన్నారు. కానీ తాజాగా పవన్, అకీరా పిక్ ని పోస్ట్ చేసి నా దేవుడు నా హీరో అంటూ క్యాప్షన్ పెట్టిన బండ్ల ని చూసిన వారు పవన్ కొడుకు అకీరా ఎంట్రీ బండ్ల బ్యానర్ లో ఉండొచ్చేమో అనే ఊహనాలు లేవనెత్తారు. బండ్ల గణేష్ అకీరా ని హీరోగా సంబోధిస్తూ చేసిన ట్వీట్ సన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బండ్ల బ్యానర్ లో పవన్ ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఇప్పుడు అదే కమిట్మెంట్ తో ఆయన కొడుకు అకీరా తో బండ్ల బ్యానర్ నుండే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు అంటున్నారు.

Akira Nandan at Pawan Kalyan Home for His Movie Debut Preparation?:

Huge Competition To Launch Pawan Kalyan Son Akira
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs