Advertisement
Google Ads BL

నిఖిల్ బర్త్ డే స్పెషల్


హీరో నిఖిల్ సిద్దార్ధ్ హ్యాపీ డేస్ తో వన్ అఫ్ ద హీరోగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చి.. కార్తికేయ, స్వామి రా..రా.., అర్జున్ సురవరం, కేశవ లాంటి సినిమాలతో హీరోగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ టైం లో తనకి తోచిన, చెయ్యగలిగిన సహాయం కరోనా పేషేంట్స్ కోసం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇక గత లాక్ డౌన్ లో తాను ప్రేమించిన అమ్మాయిని సింపుల్ గా వివాహమాడిన నిఖిల్ కెరీర్ పరంగా ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి సుకుమార్ శిష్యుడు తెరకెక్కిస్తున్న 18 పేజెస్ మూవీ, మరొకటి కార్తికేయ సీక్వెల్ కార్తికేయ 2. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వలన ఆగాయి.

Advertisement
CJ Advs

నేడు నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా నిఖిల్ నటిస్తున్న రెండు సినిమాల లుక్స్ ని నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ వదిలారు. కార్తికేయ గా నిఖిల్ లుక్ తో పాటుగా.. 18 పేజెస్ లో నిఖిల్ అండ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లుక్ వదలడమే కాదు.. 

నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.. అంటూ నిఖిల్ కళ్ళకి కట్టిన గంతలు మీద అనుపమ పెన్ను తో రాస్తుండే పిక్ ని నిఖిల్ బర్త్ డే విషెస్ పోస్టర్ గాను, 18 పేజెస్ ఫస్ట్ లుక్ పోస్టర్ గాను వదిలి నిఖిల్ కి విషెస్ చెప్పింది టీం. మరి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నిఖిల్ సిద్దార్థ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Nikhil Birthday Special:

Nikhil Birthday: 18 Pages Movie First look and Karthikeya 2 Poster 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs