Advertisement
Google Ads BL

పవన్ ని చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది


పవన్ కళ్యాణ్ ఏప్రిల్ ఎండింగ్ లో కరోనా బారిన పడడం ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఆయనకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది అని, డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్న పవన్ అంటూ చెప్పేసరికి పవన్ ఫాన్స్ లో కంగారు, ఆందోళన. అయితే దాదాపుగా 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ని కరోనా వెంటాడింది. 20 రోజుల తర్వాత నెగెటివ్ వచ్చినా.. ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో పవన్ మరిన్ని రోజులు రెస్ట్ లోనే ఉండాలని పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా కొడుకు అకీరా తో కలిసి ఓ సంగీతం టీచర్ అడిగింది కదా అని ఫోటోకి ఫోజులిచ్చారు. అయితే ఆ పిక్ లో ఎక్కువగా అందరూ పవన్ కొడుకు అకీరా మీదే ఫోకస్ పెట్టారు. అకీరా హైట్, వెయిట్ గురించి మాట్లాడారు. కానీ పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం బాగా చిక్కిపోయినట్టుగా.. కాస్త గెడ్డం పెంచి కనిపించారు. ఆయన ఆరోగ్యంగా కనిపించడంతో పవన్ ఫాన్స్ సంతోషించినా పవన్ అలా వీక్ అవడం చూసి ప్రాణం తరుక్కుపోతుంది అంటూ ఫీలవుతున్నారు. రాజకీయాలతో ఫిట్ నెస్ పక్కనబెట్టి ఒకేసారి వకీల్ సాబ్ షూటింగ్ లోకి దిగినా పవన్ ఫ్రెష్ గానే కనిపించారు. కానీ ఇప్పుడు పవన్ ఇలా వీక్ గా కనిపించడం చూసి పవన్ ఫాన్స్ నీరసపడిపోతున్నారు. 

Pawan Kalyan new pic goes viral:

Pawan Kalyan and Akira new pic goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs