Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటిస్తున్నప్పటి నుండి పెద్దగా బయట ఫోకస్ అవ్వడం లేదు. గత ఏడాది లాక్ డౌన్ ముగియగానే భార్య పిల్లలతో దుబాయ్ వెళుతూ ఓ సారి, ఈ ఏడాది జెమినీ ఛానల్ కోసం ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రెస్ మీట్ అప్పుడు ఒకసారి, ఎప్పుడైనా తన కొత్త డైరెక్టర్స్ ని కలిసినప్పుడు ఇలా గత రెండేళ్లుగా ఎన్టీఆర్ ని ఫాన్స్ చూసింది వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీం గా ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఇచ్చిన పోస్టర్ తో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటించబోయే #NTR30 లుక్, అలాగే ప్రశాంత్ నీల్ తో మరో మూవీ ప్రకటించి ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్. 

Advertisement
CJ Advs

అదలా ఉంటే.. ఈమధ్యనే కోవిడ్ బారిన పడి కోలుకున్న ఎన్టీఆర్ హెల్త్ అప్ డేట్ ఎప్పటికప్పుడు ఫాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తనకి నెగెటివ్ వచ్చిన విషయాన్నీ అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్ తాజాగా ఓ పిక్ తో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. అది కూడా ఎన్టీఆర్ కొడుకు అక్షరాభ్యాసం సందర్భంగా ఎన్టీఆర్ ఓ పంతులు గారు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటే.. ఎన్టీఆర్ ట్రెడిషనల్ లుక్ చూసిన ఆయన ఫాన్స్ మా ఎన్టీఆర్ బాగా కోలుకున్నాడు అంటూ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఎన్టీఆర్ తన చిన్న కొడుకు అక్షరాభాస్యాన్ని తన ఇంట్లోనే సింపుల్ గా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ క్లిక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసేసుకుంటున్నారు.

NTR Latest Pic goes viral :

Young Tiger NTR Latest Traditional Pic goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs