Advertisement
Google Ads BL

విమర్శకులపై విరుచుకుపడిన హీరోయిన్


ఈమధ్యన సోను సూద్, చిరంజీవి చేస్తున్న కరోనా సహాయ కార్యక్రమాలను చూసిన అభిమానులు.. మిగతా సెలబ్రిటీస్ మీద విరుచుకు పడుతున్నారు. అభిమానుల మీద, ప్రేక్షకుల మీద డబ్బు సంపాదించే సెలెబ్రిటీస్ కష్టకాలంలో ఆ ప్రజలను ఆదుకోవడానికి ఎటువంటి సహాయం చెయ్యడం లేదంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్ట్ లు పెడుతూ సెలబ్రిటీస్ ని కించపరుస్తున్న తీరు ని చూసి హీరోయిన్ ఫైర్ అవుతుంది. ఆమె మిల్కి బ్యూటీ తమన్నా. మేము సెలబ్రిటీస్ అయినా.. మేము చేసే ప్రతి పని చెప్పి చెయ్యాలంటే కుదరదు. మాకున్న తాహతతో మేము ఎంతోకొంత సహాయం చేస్తున్నాం. నేను నా స్థాయిలో సహాయం చేశాను.

Advertisement
CJ Advs

అలా అని నేను చెప్పుకొను. నావరకు నేను చేసిన సహాయాన్ని చెప్పను, కొంతమంది చెప్పి వారి ద్వారా స్ఫూర్తి పొంది మరి కొందరి సహాయం చేస్తారని చెబుతారు. సహాయం చేసి సైలెంట్ గా ఉంటున్న సెలబ్రిటీస్ ని తప్పుబట్టడం సరికాదు అంటున్న మిల్కి బ్యూటీ.. ఇలాంటి విషయాల్లో అందరూ సెలబ్రిటీస్ నే వేలెత్తి చూపుతుంటారు. ఎలాంటి విషయాలైన సెలబ్రిటీస్ ముందుకు రావాలంటూ ఒత్తిడి చేస్తారు. కానీ నాలాంటి వారు చేసింది బయటికి చెప్పరు. సెలబ్రిటీస్ అయితే కోట్లు కోట్లు వాళ్ళ ఇంట్లో మూలుగుతున్నాయనుకుంటే తప్పే.. తమకి అవసరాలుంటాయని.. అవసరమైన, అనవసరమైన ఇష్యూస్ ని లేవదీసి ట్రోల్ చెయ్యడం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేసే వారిపై విరుచుకుపడుతుంది తమన్నా.

Heroine fires on Netizens:

Tamannah fires on Netizens
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs