Advertisement
Google Ads BL

క్షమించమంటున్న కొత్త పెళ్లికూతురు


ఈ రోజు మద్యాన్నం సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లి ఫొటోస్ దర్శనమిచ్చాయి. సడన్ గా లాక్ డౌన్ లో పెళ్లి పీటలెక్కి పెళ్లి కూతురుగా కనిపించిన ప్రణీత సుభాష్ ని చూసి అందరూ షాకయ్యారు. చడీ చప్పుడు లేదు, కనీసం పెళ్లి వార్తలు కూడా ఎక్కడా వినిపించకుండానే ప్రణీత ఇలా షాకిచ్చేందేమిటి అనుకున్నారు. బిజినెస్ మ్యాన్ నితిన్ రాజుని వివాహం చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రణీత ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత గుట్టుగా పెళ్లి పీటలెక్కిందేమిటి చెప్మా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తన పెళ్లి విషయం చెప్పకుండా ఇలా సైలెంట్ గా పెళ్లి ఎందుకు చేసుకుందో ప్రణీత అభిమానులతో షేర్ చేసుకుంది. ఏప్రిల్ 30 నే నితిన్ రాజుని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని, కానీ పెళ్లి విషయం మీకు చెప్పకుండా.. ఇలా సమాచారం ఇవ్వకుండా ఉన్నందుకు ముందుగా నన్ను క్షమించండి అంటుంది కొత్త పెళ్లి కూతురు ప్రణీత సుభాష్. ప్రస్తుతం ఉనన్ కరోనా సెకండ్ వేవ్ సిస్ట్యువేషన్ లో పెళ్లి తేదీని మేము చివరి వరకు అనుకోలేదని, అలా ఏదో ఒక డేట్ చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూ అందరిని కన్ఫ్యూజ్ చెయ్యడం ఇష్టం లేకే పెళ్లి డేట్ చెప్పలేదంటుంది. దయచేసి నన్ను క్షమించండి. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పెళ్లి రోజు మీరంతా భాగస్వామ్యం కావడం కంటే నాకు మరో ఆనందం లేదు. 

మీరంటే నాకెప్పుడూ ప్రత్యేకమే. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మనందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం.. ప్రేమతో ప్రణీత అండ్ నితిన్ అంటూ ట్వీట్ చేసింది. మరి పెళ్లి విషయం సైలెంట్ గా మెయింటింగ్ చేసినా పెళ్లి చేసేసుకున్నాక ఇలా క్షమాపణ చెప్పగానే అందరూ కూల్ అయ్యరులే.

Pranitha Subhash gets hitched to boyfriend Nitin Raju in a private ceremony:

Pranitha Subhash ties the knot with Nitin Raju in a hush-hush ceremony; apologises to fans for not informing them
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs