Advertisement
Google Ads BL

నా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది


ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన శృతి హాసన్ కి ఆ లవ్ బ్రేకప్ అయ్యాక సినిమాలను దూరం పెట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటున్నా ఆమె లుక్స్ పై బోలెడన్ని ట్రోల్స్ వస్తున్నాయి. లుక్స్ పరంగా శృతి హాసన్ కెరీర్ కి డ్యామేజ్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. అయితే శృతి హాసన్ మాత్రం తాను కావాలనే సినిమాలకు గ్యాప్ ఇచ్చాను అని.. అంతేకాని అవకాశాలు లేక సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదని చెబుతుంది. నేను సినిమాలకు గ్యాప్ అనేది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. 

Advertisement
CJ Advs

అది నన్ను నేను మార్చుకోవడానికి తీసుకున్న నిర్ణయం. నేను విరామం తీసుకుని మార్చుకున్నా.. ఆ మార్పును ఇప్పుడు నా చుట్టూ ఉన్నవారు గుర్తించారు అని అంటుంది. కెరీర్ పై నిర్లక్ష్యంతోనే.. లేదంటే పనిపై ఆసక్తి తగ్గో నేను విరామం తీసుకోలేదు. నా పనిని మరింతగా మెరుగు పరుచుకునేందుకు నన్ను సిద్ధం చేసుకోవడానికి అలా విరామం తీసుకున్నా. గతంలో సంగీతంపై పెద్దగా దృష్టి పెట్టేదాన్ని కాదు. కానీ నాకు సంగీతం అంటే పిచ్చి. అందుకే ఇప్పుడు అటు సంగీతం, ఇటు నటనా రెండింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో ప్రణాళిక వేసుకున్నా. ఇక లాక్ డౌన్ తర్వాత క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో హిట్ కొట్టాను. అలాగే పిట్టకథలుతో నెట్ ఫ్లిక్స్ లో నటించాను. ఇక కోలీవుడ్ లో లాభం షూటింగ్ పూర్తయ్యింది. సలార్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.. సో నా కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు.. ఫుల్ స్వింగ్ లో ఉంది అంటుంది శృతి హాసన్.

Shruti Haasan Opens up on her Career:

Shruti Haasan Opens Up On Long Gap In Films 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs