Advertisement
Google Ads BL

నటి చాందిని - మాజీ మంత్రి కేసులో ట్విస్ట్


గత రెండు రోజులుగా తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ తనని మోసం చేసాడని, తనని తల్లిని చెయ్యడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు అంటూ నటి చాందిని పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం సంచలనంగా మరింది. 2017 నుండి మణికందన్ తో తనకి పరిచయం ఏర్పడింది అని, ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ గా మారడానికి తామిద్దరం ఓ బంగ్లాలో కలిసేవాళ్లమని, ఆ టైం లో తన భార్య తనని పట్టించుకోవడం లేదంటూ నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించి నన్ను వశం చేసుకున్నాడని,  ఐదేళ్లుగా సహజీవం చేశామని, మూడుసార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమని అడిగితే మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
CJ Advs

అయితే మణికందన్ మాత్రం అసలామె ఎవరో తనకి తెలియదని.. ఆమె కావాలనే తనని ఇరికిస్తుంది అని ఆమె మాటలను కొట్టిపారేశాడు. కానీ చాందిని మాత్రం మణికందన్‌తో సాగిన వాట్సప్ చాటింగ్, ఆయనతో దిగిన ఫొటోలను పోలీసులకు చూపించగా వారు.. చాందిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనకి అబార్షన్ చేసిన విషయం బయట ఎవరికైనా చెబితే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామని ఆ మంత్రి బెదిరించినట్లుగా ఆమె పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఎంతగా వాదించిన మణికందన్ మాత్రం అవన్నీ అవాస్తవాలంటూ కొట్టి పారేస్తున్నారు..

 

Who Is Chandini? Actor Accusing ADMK Politician Of Forced:

Tamil Actress Chandini Files Case on Ex Minister
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs