Advertisement
Google Ads BL

బాలయ్య బర్త్ డే సర్ప్రైజ్ అదే


బాలకృష్ణ బర్త్ డే కి గత ఏడాది బోయపాటి BB3 నుండి టీజర్ వదిలి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక ఈమధ్యనే బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ టీజర్ రికార్డులని క్రియేట్ చేసి నందమూరి ఫాన్స్ లో ఊపు తెచ్చింది. బాలకృష్ణ కి కొన్నాళ్లుగా హిట్స్ లేవు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్, పైసా వసూల్ ఇలా చాలా ప్లాప్స్ తర్వాత రాబోతున్న అఖండ మూవీపై భారీగా అంచనాలుండడానికి బాలయ్య - బోయపాటి కాంబో ఒక కారణమైతే. అఖండ టీజర్ ఒక కారణం. అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అఖండ రిలీజ్ ఉంటుంది అన్న టీం కి కరోనా సెకండ్ వేవ్ దారుణంగా హ్యాండ్ ఇచ్చింది. దానితో సినిమా వాయిదా పడింది. అయితే ఆ రోజు బాలయ్య అఖండ నుండి ఫస్ట్ సింగల్ వదులుతారనే అనుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ మే 28 న కేవలం బాలయ్య ఆలపించిన శ్రీరామ దండకం తప్ప మరే సర్ప్రైజ్ ఫాన్స్ కి అందలేదు. అయితే బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 న రాబోతుంది. అదే రోజు నందమూరి ఫాన్స్ కి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. అదే అఖండ నుండి ఫస్ట్ సింగల్ తో పాటుగా.. బాలయ్య అఖండ పోస్టర్ ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు.. బాలకృష్ణ - గోపీచంద్ కాంబోలో మూవీ అనౌన్సమెంట్ పోస్టర్ ని మైత్రి మూవీస్ వదలబోతున్నారని అంటున్నారు. మరి జూన్ పదిన బాలయ్య బర్త్ డే తో పాటుగా ఆయన నటించబోయే సినిమాల సర్ప్రైజ్ లతో ఫాన్స్ కి పండగే అన్నమాట.

 

balakrishna Birthday surprise:

Special Song from Akhanada on Balakrishna birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs