Advertisement
Google Ads BL

కాజల్ మరో లేడి ఓరియెంటెడ్


కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్నాక కూడా నాగార్జున తో ఒక యాక్షన్ మూవీ చెయ్యడానికి ఒప్పుకుంది. ఆ మధ్యన కాజల్ అగర్వాల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది అంటున్నప్పటికీ.. కాజల్ సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటో షూట్స్ ని పోస్ట్ చేస్తూ హంగామా చేస్తుంది. గౌతమ్ కిచ్లు సహకారంతో సినిమాల్లో నటిస్తున్నాను అంటున్న కాజల్ అగర్వాల్ లైవ్ టెలి కాస్ట్ తో డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టింది. కాజల్ డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన వెబ్ సీరీస్ కి అంతగా పేరు రాకపోయినా.. సినిమాలతో మాత్రం బాగా బిజీ.

Advertisement
CJ Advs

అయితే తాజాగా కాజల్ మరో లేడి ఓరియెంటెడ్ సినిమాకి ఓకె చెప్పినట్టుగా టాక్. థ్రిల్లింగ్‌ కథతో మ్యాజిక్‌  చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జయశంకర్‌ అనే దర్శకుడు చెప్పిన కథ, స్క్రిప్ట్‌ కాజల్‌కి నచ్చడంతో ఆ సినిమా పట్టాలెక్కించేందుకు దర్శకుడు సన్నాహాలు మొదలు పెట్టాడని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం.  ప్రస్తుతం ఆచార్య మూవీ, నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ తో పాటుగా తమిళంలో ఇండియన్ 2 లోను నటిస్తుంది. ఇక ఇప్పుడు ఈ లేడి ఓరియెంటెడ్ మూవీ కూడా ఓకె చెబితె కాజల్ డైరీ మరో ఏడాదిన్నర ఫుల్ అవుతుంది.

Kajal will be doing a lady oriented thriller:

Kajal Aggarwal to do a lady oriented thriller
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs