Advertisement
Google Ads BL

చరణ్-ఎన్టీఆర్ తో RRR స్పెషల్ సాంగ్


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు అని తెలుసు. కానీ వాళ్ళు ఆ సినిమాలో కలిసి ఎంతసేపు స్క్రీన్ మీద ఉంటారు. అలా కలిసి కనిపిస్తే బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం. అసలే ఫాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఒకే యాక్షన్ సీన్ లో ఇద్దరు స్టార్ట్ హీరోల రేంజ్ ఎలా చూపించబోతున్నాడో జక్కన్న అనే ఆసక్తితో ఉన్నారు. అప్పట్లో బాహుబలిలో ప్రభాస్ - రానా శత్రువుల మీద ఒకేసారి యుద్దానికి వెళ్లినా.. ఇద్దరి స్టామినా సమానంగా చూపించాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ - రాజమౌళి అల్లూరి - కొమరం భీం ఏ సందర్భంలో కలుస్తారు. ఎన్ని యుద్దాలు కలిసి చేస్తారో కానీ.. ఇప్పుడు బయటికొచ్చిన అప్ డేట్ వింటే ఫాన్స్ కి పండగే. 

Advertisement
CJ Advs

అది ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ఉంటుందట. ఆ సాంగ్ ఫాన్స్ కే కాదు.. యావత్ భారతదేశ ప్రేక్షకుడు గర్వపడేలా.. అదిరిపోయేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. ఆ సాంగ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చివరిలో ప్లాన్ చేసాడట. ఆ సాంగ్ పూర్తికాగానే గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారట.  ఆర్.ఆర్.ఆర్ లో ఆ సాంగ్ ఎప్పటికి గుర్తుండిపోయే ల జక్కన్న భారీతనంతో భారీగా తెరకెక్కించబోతున్నాడట. ఆ సాంగ్ కోసమే భారీ సెట్టింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా దేన్నీ చూసినా భారీగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫాన్స్ కి చరణ్ ఫాన్స్ కి ఓ మెమొరబుల్ గా ఉండబోతుంది అని ఆర్.ఆర్.ఆర్ యూనిట్ చెబుతుంది.

Special song on NTR and Ram Charan in RRR:

All about NTR, Ram Charan song in RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs