ఒకప్పుడు స్టార్ హీరోల తో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ కి తెలుగులో సినిమా ఆఫర్స్ అన్నవే లేకుండా పోయాయి. గత రెండుమూడేళ్లుగా రకుల్ కి తెలుగులో ఆయమన్న సినిమా తగిలింది లేదు. స్పైడర్, మన్మధుడు 2 సినిమాల డిజాస్టర్ తో రకుల్ బాలీవుడ్ కి చెక్కేసింది. సీనియర్ హీరో అయిన నాగ్ తో మన్మధుడు 2 సినిమాలో రొమాంటిక్ గా, గ్లామర్ గా కనిపించిన రకుల్ కి ఆ సినిమా కోలుకోలేని డిజాస్టర్ ఇచ్చింది. ఆ దెబ్బకి రకుల్ రేంజ్ మరింత దిగజారిపోయింది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ బాలకృష్ణ మూవీకి నో చెప్పింది అనే టాక్ మొదలయ్యింది.
బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీ కోసం దర్శకుడు గోపీచంద్ హీరోయిన్స్ వేటలో ఉన్నాడు. ఇప్పటికే శృతి హాసన్, త్రిష లాంటి వాళ్ళని సంప్రదించినా వారు డేట్స్ కుదరక నో చెప్పడంతో గోపీచంద్ మలినేని రకుల్ ని బాలయ్య సినిమా కోసం సంప్రదించగా.. దానికి రకుల్ ప్రీత్ మొహమాటం లేకుండా నో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే బాలయ్య సినిమాలో నటించను అని చెప్పింది హిందీ ప్రాజెక్టుల కారణంగా తాను బిజీగా ఉన్నానని అందట. దానితో గోపీచంద్ మలినేని కథ మళ్ళీ మొదటికే వచ్చింది అని ఫీలవుతున్నాడట.