Advertisement
Google Ads BL

భయంతోనే షూటింగ్ కి వెళ్ళా


కరోనా సెకండ్ వెవ్ స్టార్ట్ అవడమే చాలా సినిమాల షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసారు. తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టేటవరకు బాలయ్య అఖండ మూవీ, సుకుమార్ పుష్ప మూవీ, ఇంకా నాని శ్యామ్ సింగ రాయ్ మూవీ, నాగ చైతన్య థాంక్యూ మూవీ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే అఖండ, శ్యామ్ సింగ రాయ్, పుష్ప అన్ని హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరిగినా.. నాగ చైతన్య విక్రమ్ కుమార్ ల థాంక్యూ మూవీ షూటింగ్ ఇటలీలో కానిచ్చేశారు. ఇండియాలో కరోనా ఉధృతి పెరుగుతున్న తరుణంలో మూవీ టీం మొత్తం ఇటలీ వెళ్లి అక్కడే థాంక్యూ షూటింగ్ ని కంప్లీట్ చేసి వచ్చేసింది. అక్కడ ఇటలీలో రాశి ఖన్నా - నాగ చైతన్య ల సెల్ఫీ, షూటింగ్ ఫినిష్ అయినట్లుగా టీం మొత్తం కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఇటలీలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇండియా లోని కరోనా పరిస్థితులు విని చాలా భయపడ్డాను అంటుంది రాశి ఖన్నా. అసలు ఇండియా వదిలి బయటికి వెళ్లంటేనే భయం వేసింది. కానీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చెయ్యాలి కనక ఇటలీ వెళ్ళాము. ఇటలీలో కూడా కొన్ని ప్లేస్ ల్లో లాక్ డౌన్ పెట్టడంతో పరిమిత లొకేషన్స్ లోనే థాంక్యూ షూటింగ్ కంప్లీట్ చేసినా.. అక్కడ ఉన్నప్పుడు ఇండియాలో పరిస్థితులు చూసి భయ పడ్డాము. ఇటలీలో ఎక్కడికి వెళ్లకుండానే 18 గంటల శ్రమించి థాంక్యూ షూటింగ్ కంప్లీట్ చేసి ఇండియా కి వచ్చెసాము అంటుంది రాశి ఖన్నా.

Raashi Khanna says she was constantly thinking about India:

Raashi Khanna says she was constantly thinking about India while shooting in abroad amid Covid 19
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs