ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, అలాగే కొన్ని జట్లలోని క్రికెటర్స్ కరోనా బారిన పడడంతో పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో క్రికెటర్స్ అంతా తమ తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. అయితే మిగిలి మ్యాచ్ ల నిర్వహణపై బిసిసిఐ ఎప్పటినుండో కసరత్తులు చేస్తుంది. ఈ మిగిలిన సీజన్ దుబాయ్ వేదికగా పూర్తి చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినా తాజాగా ఈ రోజు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్ ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ పై వివరణ ఇచ్చారు.
ఐపీఎల్ లో పోస్ట్ ఫోన్ అయిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటించారు. మొదటి పదిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్కో రోజు ఒక్కో మ్యాచ్ జరిగేలా ఏడు రోజుల పాటు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం యూఏఈ లో వేదిక ఖరారు కావడంతో.. తదుపరి మ్యాచ్ ల షెడ్యూల్ ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.