Advertisement
Google Ads BL

కామ్ గా వేడుక చూస్తున్న సామ్

samantha akkineni,samantha,silen,family man 2 controversy,family man 2,the family man 2,raj and dk | కామ్ గా వేడుక చూస్తున్న సామ్

సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ ద ఫ్యామిలీ మ్యాన్ 2 జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈమధ్యనే విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ కి విశేషమైన స్పందన వచ్చింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ విడుదలయ్యాక LTT టెర్రరిస్ట్ గా కనిపిస్తున్న సమంత పాత్ర పై తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఈ వెబ్ సీరియస్ ని అడ్డుకుంటామని తమిళ్ సంఘాలు గోల చెయ్యడమే కాదు. తమినాడు ప్రభుత్వం ఈ విషయమై కేంద్ర మంత్రికి లేఖ కూడా రాసింది.

Advertisement
CJ Advs

అయితే ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే లు మాత్రం తమ టీం లో తమిళులు కూడా ఉన్నారని, వాళ్ళకి తమ చరిత్రపై ఎంతో కొంత అవగాహన ఉంటుంది, తమిళులపై ఎలాంటి అసభ్యకరమైన సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ వెబ్ సీరీస్ లో లేవని, ట్రైలర్ చూసి ఓ అంచనాకి రావొద్దు అంటూ స్పందించారు. ఇక ఈ సీరీస్ లో తమిళుల నుండి ఆ ఇష్యు వచ్చిందే సమంత  పాత్రపై. కానీ సమంత మాత్రం ఆ వివాదంపై పెదవి విప్పడం లేదు. ప్రస్తుతం కామ్ గా చూస్తూ కూర్చుంది.

The Family Man 2 Controversy: Why is Samantha silent?:

Why is Samantha silent on The Family Man 2 Controversy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs