గత ఏడాది బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్ సూయిసైడ్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి నెటిజెన్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుంది. అప్పుడు ఆ టైం లో చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాని చూడడానికి భయపడిపోయారు. అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సుశాంత్ సింగ్ రాజపుట్ కేసు విషయం తిరిగి తిరిగి అది డ్రగ్స్ కేసు కింద బాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ లో అరెస్ట్ లు జరగడం, కొన్ని రోజులు సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి కటకటాల పాలు కూడా అయ్యింది. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
తాజాగా సుశాంత్ సింగ్ కేసులో ఆయన పీఆర్వో మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ని ఎన్ సీబీ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లో అరెస్ట్ చెయ్యడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ తో లాస్ట్ ఫోన్ కాల్ మాట్లాడిన సిద్ధార్థ్ పితాని.. గతంలో సుశాంత్ సింగ్ ప్లాట్ లో అతనితో కలిసి మూడేళ్లు ఉన్నాడట. ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసి ముంబై కి తరలించారు. సిద్ధార్థ్ పితాని ని అరెస్ట్ చేశామని, త్వరలోనే అతనిని కోర్టులో హాజరు పరుస్తామని ఎన్ సీబీ అధికారులు చెబుతున్నారు.