రకుల్ ప్రీత్ కి టాలీవుడ్ మొండి చెయ్యి చూపించగానే బాలీవుడ్ అవకాశాలు వెతికి పట్టుకుని అక్కడ ముంబై లోనే ఫిక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. టాలీవుడ్ చిన్న చూపు చూసినా బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేసరికి.. రకుల్ ప్రీత్ ముంబై లోనే ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ జిమ్, వర్కౌట్స్, బాలీవుడ్ లో మిడ్ నైట్ పార్టీస్ అంటూ హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రకుల్ ప్రీత్ తెలుగులో ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలతో నటించేసింది. ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి చెక్కేసిన రకుల్ కి అక్కడ కూడా ఎదురు దెబ్బలు మొదలయ్యాయి.
ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూత బడడంతో రకుల్ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ కా గ్రాండ్ సన్ ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్జున్ కపూర్ తో కలిసి సర్దార్ కా గ్రాండ్ సన్ లో నటించిన రకుల్ ఆ సినిమా ఫలితం షాకిచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమాకి తక్కువ స్థాయిలో వ్యూయర్ షిప్ రావడంతో ఆ సినిమా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లడమే కాదు.. తన పాత్రకి అనుకున్నంత గుర్తింపు రాకపోవడం రకుల్ కూడా చాలా ఫీలవుతుంది. సినిమా ప్లాప్ అయినా కనీసం తన పాత్ర కి మంచి మార్కులు పడితే రకుల్ హ్యాపీ గా ఫీలయ్యేది. కానీ ఇప్పుడు రకుల్ కి ఆ సినిమా ఫలితం బాగా బాధపెడుతోంది. ఇక రకుల్ ఆశలన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎటాక్, మే డే మీదే ఉన్నాయంటున్నారు.