Advertisement
Google Ads BL

బాహుబలిని గుర్తు చేసిన కళ్యాణ్ రామ్


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానా హీరో - విలన్స్ గా నటించిన బాహుబలి మూవీలో ఆ పాత్రలు, ఆ బాహుబలి, భల్లాలదేవ, దేవసేన ఇలా ఆ సినిమాలో ఏ లుక్స్ ని ప్రేక్షకులు ఇప్పట్లో అయితే మరిచిపోలేరు. బలమైన పాత్రలతో పాటుగా బాహుబలిగా ప్రభాస్ ఆజానుబాహు లుక్ ఎప్పటికీ కంటి నిండా అలానే కనిపించే రూపం. ఇప్పుడు అదే లుక్ తో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్ ని రివీల్ చేసాడు. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో మొదలైనా.. ఈరోజు తాతగారి బర్త్ యానివర్సరీ సందర్భంగా తన NKR18 లుక్ అండ్ టైటిల్ ని రివీల్ చేసాడు కళ్యాణ్ రామ్.

Advertisement
CJ Advs

మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బింబిసార అనే పవర్ ఫుల్ టైటిల్ ని అలాగే కళ్యాణ్ రామ్ బింబిసార లుక్ ని రివీల్ చేసారు. తన సామ్రాజ్యంపై దండెత్తి వచ్చిన శత్రుమూకలపై విరుచుకుపడి.. చీల్చి చెండాడి.. వారి శవాల మీద కూర్చున్న యోధుడిగా కల్యాణ్‌రామ్‌ కనిపించాడు. అయితే కళ్యాణ్ రామ్ బింబిసార టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్నా.. ఆయన లుక్ చూడగానే బాహుబలిలో ప్రభాస్ గుర్తొచ్చేసాడు అంటున్నారు నందమూరి ఫాన్స్. ప్రభాస్ అంత కాకపోయినా కళ్యాణ్ రామ్ బింబిసార లుక్ లో ఉగ్రరూపుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడిగా కేథరిన్‌, సమ్యుక్తా నటిస్తున్నారు.

Nandamuri Kalyan Ram Bimbisara title revealed :

Nandamuri Kalyan Ram 18th film title and first glimpse are unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs