Advertisement
Google Ads BL

రౌడీ హీరోపై నిర్మాత షాకింగ్ కామెంట్స్


అర్జున్ రెడ్డి, గీత గోవిందం దెబ్బకి స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ కి రౌడీ బ్రాండ్ బాగా కలిసొచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ పెరిగిపోయింది. అందుకే విజయ్ పాన్ ఇండియా లెవల్ లో పూరి జగన్నాధ్ తో కలిసి లైగర్ మూవీ చేస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ లైగర్ కన్నా ముందు ఓ భారీ డిజాస్టర్ పడింది. అది వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆ సినిమా నిలిచింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ లతో చేసిన ఆ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది అనుకుని రాంగ్ స్టప్ వేసాడు విజయ్. ఆ సినిమాతో నిర్మాత లాస్, ఆ సినిమాని కొన్న బయ్యర్లు లాస్. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇదే తన చివరి లవ్ స్టోరీ అంటూ విజయ్ దేవరకొండ ఆ సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేసాడు.

Advertisement
CJ Advs

కానీ సినిమా రిలీజ్ అయ్యాక కానీ ఆ లవ్ స్టోరీ దమ్మేమిటో తేలలేదు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ పై నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన అభిషేక్ నామ సంచలన వ్యాఖ్యలు చేసారు. నా కెరియర్‌లో నన్ను బాగా బాధ పెట్టిన సంఘటన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ కావడం. ఆ సినిమా ప్లాప్ అవడంతో చాలా బాధపడ్డాను. కనీసం ఊహించని డిజాస్టర్ ఆ సినిమా. ఆ సినిమాకి పెట్టిన దానిలో 10 శాతం కూడా డబ్బులు రాలేదు. దాదాపుగా వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాకి 90 శాతం నష్టం వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా.. కేఎస్ రామారావుగారి సినిమాకి భారీ నష్టం రావడం ఊహించలేదు. అయితే వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా ప్లాప్ టాక్ పడి.. డిజాస్టర్ అయ్యాక హీరో విజయ్ దేవరకొండ రెస్పాండ్ కాలేదు. 

విజయ్ దేవరకొండ వలన చాలా బాధపడ్డా. అర్జున్ రెడ్డి సినిమాకి కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేశా. కానీ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాకి వచ్చేసరికి విజయ్ మార్కెట్ బాగా పెరిగింది.. అందుకే ఆలోచించకుండా  ఫ్యాన్సీ రేటుకి వెళ్లిపోయాం. కానీ ఆ సినిమా ఇండస్ట్రీ డిజాస్టర్ అయ్యింది. సినిమా హిట్ అయితే.. అందరితో పంచుకుంటారు. కానీ ప్లాప్ అయితే వెనక్కి తిరిగి చూడడం అటుంచి ఫోన్ కూడా స్విచాఫ్ చేస్తుంటారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. రేపటి రోజున వాళ్లతో సినిమాలు తియ్యగలమా.. ఈ విషయంలో విజయ్ మారాలి. ఆ సినిమాతో నేనొక్కడినే కాదు చాలామంది బయ్యర్ల పరిస్థితి ఇదే అంటూ విజయ్ దేవరకొండ పై  అభిషేక్ నామా షాకింగ్ కామెంట్స్ చేసాడు.

Abhishek Nama Shocking comments on Vijay Devarakonda:

Abhishek Nama wants Vijay Devarakonda to change his behavior
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs