Advertisement
Google Ads BL

రణ్‌వీర్‌ నుండి అది దొంగిలిస్తానంటున్న పూజ


తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజ హెగ్డే వెంట స్టార్ హీరోస్ ఇప్పటికీ క్యూ కడుతూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ లో బడా ఆఫర్స్ వచ్చి చేరాయి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రన్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా పూజ ఎహెగ్దే చేతిలో మరిన్ని సినిమాలు చేరేలా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్‌ కభీ దివాళి మూవీ తో పాటుగా రణ్వీర్ సర్కార్ సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే ఈ మధ్యనే ఆ సినిమా డైరెక్టర్ రోహిత్ శెట్టి తో పాటుగా హీరో రణ్వీర్ సింగ్ గురించిన ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Advertisement
CJ Advs

రన్వీర్ సింగ్ మంచి సహా నటుడు అని, ఆయన ఎనర్జీ లేవల్స్ పీక్స్ అని.. రణ్వీర్ సింగ్ నుండి ఏదైనా దొంగించాల్సి వస్తే.. అతని ఎనేర్జిని, అలాగే ఆయన పరిశీలన శక్తిని తీసేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది పూజ. రన్వీర్ సింగ్ చాలా ఎనేర్జిగా ఉంటాడు అని, రణ్వీర్ సింగ్ చాలా తెలివైన వాడు. ఏ విషయమైనా అంత సులువుగా వదిలిపెట్టడు. ఆయనలో నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది. నిజానికి నేను ఇంట్రోవర్ట్‌ని. కానీ, రణ్‌వీర్‌ నాకు పూర్తి భిన్నమైన వ్యక్తి. అందుకే కొన్నిసార్లు రణ్‌వీర్‌లా ఉండాలనిపిస్తుంది.. అంటూ రణ్వీర్ సింగ్ గురించి పూజ హెగ్డే గుక్కతిప్పుకోకుండా సమాధానమిచ్చింది.

ఇక తెలుగు, హిందీ మాత్రమే కాకుండా పూజ హెగ్డే ఇప్పుడు కోలీవుడ్ లోకి అడుగుపెట్టేసింది. స్టార్ హీరో విజయ్ తో ఓ భారీ బడ్జెట్ మూవీలో విజయ్ సరసన నటిస్తుంది పూజ హెగ్డే.

Pooja says If I could borrow something from Ranveer it would be his high energy:

Pooja says If I could borrow something from Ranveer it would be his high energy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs