Advertisement
Google Ads BL

నాగ్ మూవీలో జబర్దస్త్ యాంకర్


బుల్లితెర పైన ఢీ డాన్స్ షో, ఎక్స్ట్రా బాబర్దస్త్ లో హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గౌతమ్ అటు వెండితెర మీద కూడా అవసరం వచ్చినప్పుడు హీరోయిన్ గా లక్కు పరీక్షించుకుంటుంది. అనసూయ అంత కాకపోయినా.. సిల్వర్ స్క్రీన్ మీద రష్మీ కూడా చాలా సినిమాల్లో నటించింది. అయితే అనసూయలాగా వెండితెర మీద రష్మీ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే గ్లామర్ గా, అందాలను రాబోయే రష్మీ కి ఇప్పుడు నాగ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అనసూయ చిన్న గెస్ట్ రోల్ చేసింది.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు నాగ్ - ప్రవీణ్ సత్తారు మూవీలో రష్మీ కి మంచి ఛాన్స్ వచ్చిందట. ఇప్పటికే గోవా లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ ని జూన్ సెకండ్ వీక్ నుండి మొదలు పెట్టబోతున్నారు. ఆ షెడ్యూల్ రష్మీ జాయిన్ కాబోతుంది అని.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గతంలో రష్మీ గౌతమ్ గుంటూరు టాకీస్ చేసింది కాబట్టే.. ప్రవీణ్ సత్తారు నాగ్ మూవీ కోసం అడగ్గానే రష్మీ ఈ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.

Rashmi Gautam key role in Nagarjuna and Praveen Sattaru Movie:

Rashmi Gautam key role in Nagarjuna and Praveen Sattaru action Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs