బాలకృష్ణ ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారో కోపమొస్తే ఫాన్స్ కి కోటింగే. అయినా బాలయ్య కొడితే ఫాన్స్ కి కోపం రాదు. సంతోషంగా ఫీలవుతారు. ఇక సినిమాల్లో గంభీరంగా పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పే బాలయ్య బయట మాట్లాడేటప్పుడు తడబడుతుంటారు. అలాగే ఆయనకి డాన్స్ అన్నా, పాటలు పాడడం అంటే మహా సరదా. బాలకృష్ణ - పూరి కాంబోలో వచ్చిన పైసా వసూల్ మూవీలో మామా ఏక్ పెగ్ లా అంటూ అదరగొట్టేసాడు. ఇక మొన్నామధ్యన ఆయన తండ్రి నందమూరి తారక రామారావుకి గారు ఒక సినిమాలో ఆలపించిన శివ శంకరీ.. పాట పాడి షాకిచ్చారు బాలయ్య.
అయితే ఆ శివ శంకరీ.. పాట బాలయ్య పాడడం చాలామందికి రుచించలేదు.. ఆ పాట పాడిన బాలయ్యని విమర్శించారు కూడా. అయినా బాలకృష్ణ ఆ విమర్శలను మనసులో పెట్టుకోలేదు. కాబట్టే రేపు బాలయ్య తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జన్మదినం సందర్భంగా ఓ సాంగ్ పాడి ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య పాడిన శ్రీరామ దండకం.. రేపు ఉదయం సరిగ్గా 9 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చెయ్యబోతున్నారు. నిన్ననే రేపు ఉదయం ఓ స్మాల్ సర్ప్రైజ్ అంటూ ఎన్ బీకే ఫిలిమ్స్ నుండి ప్రకటన రావడం ఈ రోజు ఉదయం బాలయ్య పాటని రేపు రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించడం ఫాన్స్ కి ఉత్సాహాన్నిచ్చింది.