Advertisement
Google Ads BL

పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టిన గని


ఈమధ్యన వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గని షూటింగ్ ఆగిపోయింది.. దర్శకుడు కిరణ్ - వరుణ్ తేజ్ మధ్యన విభేదాలు తలెత్తాయి అందుకే గని షూటింగ్ ని ఆపేశారనే టాక్ నడిచింది . మధ్యలో దర్శకుడు కిరణ్ గని కోవై విషయంలో ఎలాంటి గొడవలు లేవు, షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలోనే అని అప్ డేట్ ఇచ్చిన గని పై పుకార్లు ఆగలేదు. అయితే తాజాగా గని టీం ప్రెస్ నోట్ తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.

Advertisement
CJ Advs

నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమవుతోన్న వరుణ్ తేజ్ గని...  హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్స్  ఆధ్యర్యంలో యాక్షన్ పార్ట్ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది టీం.

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం గని. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ ప‌రిస్థితులు చ‌క్క బ‌డ‌గానే మొద‌లు కానున్నాయి. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ మా గని సినిమా ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా సెకండ్ వేవ్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌గానే నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీర‌ణ‌ను స్టార్ట్ చేస్తాం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. వ‌రుణ్ తేజ్ ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఈ షెడ్యూల్లో వ‌రుణ్‌గారు, ఇత‌ర ప్ర‌ధాన‌ తారాగ‌ణంపై యాక్ష‌న్ స‌న్నివేశాలు స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాం. ఇందు కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ భారీ స్టేడియం సెట్‌ను కూడా వేశారు. అలాగే హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఆధ్వ‌ర్యంలో ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌ర‌ణ చేస్తాం. ఈ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేస్తాం అన్నారు. 

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

Ghani gears up for the next schedule:

Varun Tej Ghani gears up for the next schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs