గూఢచారి, క్షణం, ఎవరు సినిమాలతో తనకో బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న మేజర్ మూవీ ముంబయ్ తాజ్ హోటల్ బాంబు బ్లాస్ట్ ల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో అడివి శేష్ కి పెయిర్ గా బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ నటిస్తుంది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలో నటిస్తున్న మేజర్ మూవీ జులై 2 న విడుదల కావాల్సి ఉంది. పాన్ ఇండియా లెవల్లో జులై 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా టీం ఎప్పుడో ప్రకటించింది.
అయితే ప్రస్తుతం థియేటర్స్ క్లోజ్ అవడం, సెకండ్ వెవ్ ఉధృతంగా ఉండడంతో అడివి శేష్ మేజర్ ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది టీం. ప్రస్తుతం ఉన్న కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గేవరకూ సినిమాని వాయిదా వేస్తున్నామని, పరిస్థితులు అనుకూలించక మరొక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. శశి కుమార్ టిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు నిర్మాణ సంస్థ భారీగా ఈ సినిమాని నిర్మించింది.