Advertisement
Google Ads BL

ఈటెల రాజకీయం: కిషన్ రెడ్డి క్లారిటీ


ఈటెల రాజేంద్ర కేసీఆర్ మంత్రి మండలి నుండి బర్తరఫ్ అవడం, మంత్రి మండలిలో చోటు పోవడంతో.. ఆయన దాదాపుగా టీఆరెస్ కి దూరమైనట్టే అనే విషయం అందరికి తెలిసిందే. ఆ వెంటనే టీఆరెస్ మంత్రులు ఈటెల పై మాటల దాడికి దిగడం.. తర్వాత ఈటెల రాజేంద్ర రాజకీయాలు మొదలు పెట్టడం టివి ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ నాయకులని కలవడం, తనకు మద్దతునిచ్చే టీఆరెస్ నాయకులతో మంతనాలు జరపడం వంటివి చేస్తున్నాడు. తాజాగా ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరబోతున్నాడనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టడం, ఈటెల కొడుకు నితిన్ పై కూడా  భూ కబ్జా ఆరోపణలు రావడం కేసీఆర్ వెంటనే విచారణకులు ఆదేశించడం చూస్తున్నాం. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరడంపై ఆలోచనలో ఉన్నట్లుగా న్యూస్ రావడంతో తెలంగాణ బిజెపి ముఖ్యనేత.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈటెల విషయం పై స్పందించారు. ఈటెల రాజేంద్ర తనని కలిసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అయితే తనని కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట మాత్రం వాస్తవం అని చెబుతున్నారు. అలాగే ఈటెల తానూ చాలా ఏళ్ళు ఎమ్యెల్యేలుగా అస్సాంబ్లీలో కొనసాగామని, ఒకవేళ ఈటెల రాజేంద్ర నేను కలిస్తే తప్పేమిటి అని సూటిగా ప్రశ్నించారు. ఈటెల ఒకవేళ కలిసేందుకు వస్తే.. తనకు మాట్లాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కుండ బద్దలు కొట్టారు కిషన్ రెడ్డి. 

Etela rajender Politics: Kishan Reddy Clarity:

Central Minister Kishan Reddy Gives Clarity On Meeting With Etela Rajender
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs