పాన్ ఇండియా వెబ్ సీరీస్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 అనగానే అందరిలో ఆసక్తి, అందులోనూ సౌత్ హీరోయిన్ సమంత ఆ సినిమాలో నటిస్తుంది ఆనగానే అందరిలో క్యూరియాసిటీ ఏర్పడి ఆ సీరీస్ పై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ సంచనాలకు నెలవుగా మారింది. అంతలోనే కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయింది ఆ ట్రైలర్. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత టెర్రరిస్ట్ పాత్ర చూసిన తమిళు ఆగ్రహంతో ఊగిపోతూ.. తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంది అని ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ ని అడ్డుకుంటామని అంటున్నారు. అదే దిశగా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
దానితో ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ ఆ వివాదంపై స్పందిస్తూ.. తమకి తమిళ ప్రజలు, వాళ్ల మనోభావాలపై చాలా గౌరవం ఉందని, తమ టీంలో చాలామంది తమిళ నటులు, టెక్నీకల్ టీం ఉంది అని, వాళ్ళకి తమిళ చరిత్రపై ఎంతోకొంత అవగాహనా ఉంది అని, తమిళులని కించ పరిచే విధంగా వెబ్ సీరీస్ లో ఏమి లేదని, ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ లో చూసిన కేవలం రెండు మూడు సీన్స్ కే ఎలాంటి ఒపీనియన్ కి రావొద్దని, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూసాక తమ అభిప్రాయం మారుతుంది అని.. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
మరి ఫ్యామిలీ మ్యాన్ వివాదం ఈ నోట్ తో అయినా ముగుస్తుందో లేదంటే.. అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.