Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హెల్త్ అప్ డేట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. డాక్టర్స్ ప్రికాషన్స్ మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ మధ్యలో తన హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. తనకి త్వరలోనే నెగటివ్ వస్తుంది అని.. తాను బావున్నాను అని.. అభిమానులు ఎవరూ కంగారు పడవద్దు అని చెప్పిన ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలని జరపొద్దని, కరోనా సెకండ్ వేవ్ సిట్యువేషన్ లో వేడుకలకి దూరంగా ఉండాలని, ఫాన్స్ అంతా ఇంటి పట్టునే సేఫ్ గా ఉండాలని చెప్పిన ఎన్టీఆర్ కి ఆయన నటిస్తున్న, నటించబోయే సినిమాల నుండి సర్ప్రైజెస్ అందాయి. దానితో ఫాన్స్ దిల్ ఖుష్ అయ్యారు.

Advertisement
CJ Advs

#GertWellSoonNTRAnna, #JaiNTR అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేసారు ఫాన్స్. తాజాగా ఎన్టీఆర్ మరోసారి తన హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. తనకి కరోనా నెగెటివ్ గా నిర్దారణ అయినట్లుగా ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ డిఆర్ ప్రవీణ్ కులకర్ణి మరియు నా కజిన్ డాక్టర్, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్.. వీరంతా తనకు కోవిడ్ సమయంలో ట్రీట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్.. కరొనతో పోరాడడానికి మీ సంకల్ప శక్తి మీకు అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి, ఆందోళన పడకండి. పాజిటివ్ దృక్పధంతో  ఉండండి.. తగిన జాగ్రత్తలతో కరొనతో పోరాడి కరోనని జయించండి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

Jr NTR tests negative for Covid-19:

Tarak health update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs