Advertisement
Google Ads BL

ప్రభాస్ తో తలపడబోయే సలార్ విలన్


ప్రభాస్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. ఆదిపురుష్ సెట్స్ నుండి నేరుగా హైదరాబాద్ కి వచ్చేసిన ప్రభాస్ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి షూటింగ్స్ మొదలయ్యాయి అంటే ప్రభాస్ అటు రాధేశ్యామ్ సాంగ్ చిత్రీకరణ తోనూ, ఇటు సలార్ మూవీ షూటింగ్ తోనూ, మరోపక్క ఆదిపురుష్ షూటింగ్ తో బిజీ అవుతాడు. ఊపిరాడకుండా షూటింగ్స్ చెయ్యాల్సిందే. సలార్ కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ రెడీ అయ్యాయి. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఫినిష్ చేసి సలార్ కోసం దిగిపోతాడు. అయితే ప్రభాస్ సలార్ మూవీలో సిక్స్ ప్యాక్ బాడీ తో యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తాడని అంటున్నారు.

Advertisement
CJ Advs

అలాగే సలార్ లో చాలామంది విలన్స్ తో ప్రభాస్ తలపడాల్సి వస్తుంది అని, దాని కోసమే సలార్ డైరెక్టర్ ఒక్కో భాష నుండి ఒక్కో విలన్ ని ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే  కన్నడ ఇండస్ట్రీ నుండి ఓ విలన్ అఫీషియల్ గా ఎంపిక చేసాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు మెయిన్ విలన్ ని బాలీవుడ్ నుండి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ నుండి జాన్ అబ్రహం ని ప్రభాస్ కి పవర్ ఫుల్ విలన్ గా, సలార్ కి నెగెటివ్ షేడ్స్ ఉన్న నటుడిగా తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడని, ఫాదర్ రోల్ లో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపిస్తాడని అనడంతో సినిమాపై మరింత హైప్ పెరిగిపోతుంది. 

Prabhas to fight John Abraham?:

Salaar to have a powerful antagonist
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs