Advertisement
Google Ads BL

పవన్ ఫైట్స్ ని అద్భుతంగా రీ క్రియేట్ చేసారుగా


వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించిన వకీల్ సాబ్ లో పవన్ ఫాన్స్ కి కావాల్సన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీ ఇంటి దగ్గర, రెండు కోర్టు వాష్ రూమ్స్ దగ్గర, మూడు మెట్రో ట్రైన్ లో.. ఇలా వేణు శ్రీరామ్ సినిమాకి అవసరం లేని ఫైట్స్ ని ఫాన్స్ కోసం పెట్టాడు. మూడేళ్ళ విరామం తర్వాత పవన్ స్క్రీన్ మీద సాఫ్ట్ గా కనబడితే ఫాన్స్ ఊరుకుంటారా అందుకే వేణు శ్రీరామ్ కొన్ని యాక్షన్ సీన్స్ ని హైలెట్ చేసాడు. ఇప్పుడు వకీల్ సాబ్ విడుదలవడమే కాదు.. ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లోనూ వచ్చేసింది. అయితే ఇప్పుడు నెల్లూరు కుర్రాళ్ళు వకీల్ సాబ్ యాక్షన్ సీన్స్ ని రీ క్రియేట్ చేసి అద్భుతః అనిపించారు.

Advertisement
CJ Advs

నెల్లూరు కు చెందిన కిరణ్ ఈ స్పూఫ్ ఫైట్స్ ని డైరెక్ట్ చేస్తుండగా.. మున్నా అనే కుర్రాడు పవన్ కళ్యాణ్ మాదిరి ఫైట్స్ చేస్తూ, విలన్స్ ని ఇరగ్గొడుతూ అదరగొట్టేసాడు. వకీల్ సాబ్ లో బాత్ రూమ్ ఫైట్, క్లైమాక్స్ లో వచ్చే మెట్రో రైల్ ఫైట్ ను రీ క్రియేట్ చేశారు. సినిమాలో అచ్చం పవన్ కొడుతుంటే.. విలన్స్ ఎలా ఎగిరెగిరి పడ్డారో, గాల్లోకి ఎగరడం, కొట్టడం అబ్బో ఆ వీడియో లో కుర్రాళ్ల రీ క్రియేషన్ మాములుగా లేదు. సరిలేరు నీకెవ్వరూ టైం లోనూ మహేష్ బాబు లా కొంతమంది పిల్లలు.. రమణా లోడెత్తాలిరా అనే ఫైట్ ని రీ క్రియేట్ చేసినట్టుగా.. ఇప్పుడు ఈ నెల్లూరు కుర్రాళ్ళు వకీల్ సాబ్ యాక్షన్ సీన్స్ ని రీ క్రియేట్ చేసి అది ఓ వీడియో గా రూపించింది యూట్యూబ్ లో పెట్టగా అది కాస్త వైరల్ గా మారింది. 

Vakeel Saab Re-creation Goes Viral:

The kids from Nellore are making all the noise on social media for their Vakeel Saab re-created version which has grabbed all the attention.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs