Advertisement
Google Ads BL

పుష్ప విలన్.. విక్రమ్ లో పోలీస్ ఆఫీసర్


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ షూటింగ్స్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా కారణముగా షూటింగ్ ని ఆపిన యూనిట్.. పుష్ప ఫస్ట్ పార్ట్ ఆగష్టు 13 న రిలీజ్ చెయ్యాలనే కసితో ఉన్నారు. ఇక సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది సమ్మర్ అంటున్నారు. అయితే అల్లు అర్జున్ కి అంటే పుష్ప రాజ్ విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వెవ్ వచ్చేముందే పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన ఫహద్ అల్లు అర్జున్ కి కరోనా రావడంతో ఆయన షూటింగ్ ఆపేసి వెళ్లిపోయారు. ఈ సినిమాలో మాస్ అవతార్ పుష్ప రాజ్ కి ఫహద్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఆ విలన్ లుక్ ఎలా ఉంటుంది, ఉండబోతుంది అనే దాని మీద అందరూ అతృతతో ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే అదే ఫహద్ ఫాజిల్ తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న విక్రమ్ లో విలన్ గా నటించబోతున్నాడని అన్నప్పటికీ.. ఆ సినిమాలో కమల్ కి విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే ఫహద్ కూడా సినిమాలో కనిపించనున్నాడట. ఫహద్ కమల్ విక్రమ్ మూవీలో ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని, అది కూడా అవినీతి పోలీస్ ఆఫీసర్ గా ఫహద్ రోల్ ఉంటుంది అని.. జైలు నుంచి ఖైదీలు తప్పించుకోవడానికి సహాయపడే పోలీసుగా ఫహద్ ఫాజిల్ విక్రమ్ మూవీలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నా.. మరోపక్క ఫహద్ విక్రమ్ లో పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో అనేది కోలీవుడ్ మీడియా క్లారిటీ ఇవ్వాలి.

Fahad Fazil as police officer in Vikram movie:

Fahad Fazil as police officer in Kamal - Lokesh kanakaraj Vikram movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs