Advertisement
Google Ads BL

3 డిఫ్రెంట్ లుక్స్ లో పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో స్టూడెంట్ లీడర్ గాను, లాయర్ సాబ్ గాను రెండు లుక్స్ లో కనిపించారు. లాయర్ వృత్తిని వదిలేసి.. తాగుతూ ఉండే లాయర్ పాత్రలో పవన్ లుక్స్ ఫాన్స్ కి బాగా నచ్చాయి. రాజకీయాల నుండి వెంటనే వచ్చేసి వకీల్ సాబ్ చేసినా.. ఆ లాయర్ పాత్రలో పవన్ పెద్దగా వేరియేషన్స్ చూపించక్కర్లేని కారణంగా కొత్తగా మేకోవర్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ మరో మూవీ ఏకే రీమేక్ లో పవన్ ఓ పోలీస్ ఆఫీసర్ గా మాస్ గా కనిపించనున్నారు. మలయాళ వెర్షన్ అయ్యప్పన్ కోషియమ్ లో బిజు మీనన్ లా పవన్ లుక్ మార్చకపోయినా.. పవన్ పవర్ ఫుల్ పోలీస్ లా కనిపిస్తాడు. ఇక క్రిష్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న పియాడికల్ స్టోరీ హరి హర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ కాస్త కొత్తగానే కనిపిస్తున్నారు.

Advertisement
CJ Advs

హరి హర వీరమల్లు గ్లిమ్బ్స్ లో పవన్ నుదుటున పెద్ద బొట్టు, లాంగ్ హెయిర్ స్టయిల్, డిఫ్రెంట్ కాస్ట్యూమ్స్ లో చూసాము. అయితే తాజాగా క్రిష్ సినిమాలైన కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన ఐశ్వర్య రాజీవ్.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ లుక్స్, అలాగే ఆయన ధరించబోయే కాస్ట్యూమ్స్ విషయాలను.. ఓ న్యూస్ పేపర్ ఇంటర్వ్యూ లో రివీల్ చేసింది. హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారని, అలాగే 30 రకాల కాస్ట్యూమ్స్ ని పవన్ హరి హర హర వీరమల్లు కోసం వాడబోతున్నట్లుగా రివీల్ చేసి పవన్ కళ్యాణ్ పాత్రపై ఐశ్వర్య రాజీవ్ అంచనాలు పెంచేసింది. 

క్రిష్ ఆస్థాన కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య పవన్ సినిమా కాస్ట్యూమ్స్, ఆయన లుక్స్ రివీల్ చెయ్యగానే పవన్ ఫాన్స్ లో ఆసక్తి, ఆత్రుత పెరిగిపోతున్నాయి. మరి పలు భాషల్లో విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు పై ఈ దెబ్బతో అంచనాలు పెరగడం ఖాయం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్.

Pawan klayan will Appear in 3 Different looks :

Pawan klayan will Appear in 3 Different looks with 30 Different Attires 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs