Advertisement
Google Ads BL

తండ్రి మరణం తర్వాత మొదటిసారిగా ప్రదీప్


యాంకర్ కం హీరో ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ రావు గారు రీసెంట్ గా కరోనా తో కన్ను మూసిన విషయం తెలిసిందే. అప్పటినుండి ప్రదీప్ ఇప్పటివరకు తండ్రి మరణం విషయంలో స్పందించలేదు. బయట కనబడింది లేదూ. తండ్రి మరణం, ఆయన జ్ఞాపకాల నుండి కోలుకోలేని ప్రదీప్ మాచిరాజు తాజాగా తండ్రి మరణానంతరం అంటే దాదాపు మూడు వారాల తర్వాత తండ్రిని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఐ లవ్‌ యూ నాన్న.. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన నీకు థాంక్యూ.. అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement
CJ Advs

నేను గౌరవ మర్యాదలతో ఎలా బ్రతకాలో నేర్పించిన మీకు థాంక్స్, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది మీ గొప్పదనమే. .. నా కోసం అండగా నిలబడిన మీకు ఇదంతా అంకితం. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.. నేను చెడ్డదారి ఎంచుకుంటుంటే.. నన్ను సరిదిద్దారు. మీ ప్రేమకంటే గొప్పది ఏది లేదు.. మీరెప్పుడు నాకు ప్రత్యేకమే.. మీరు కోరుకున్నట్టుగానే ప్రేక్షకులని మళ్ళీ మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాను.. లవ్ యు నాన్నా.. మిస్ యు నాన్న అంటూ ఎమోషనల్ గా ప్రదీప్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన వారు ప్రదీప్ తండ్రి మరణంతో ఎంతగా కలత చెందాడో అంటున్నారు.

Pradeep Machiraju Shares Emotional Post On His Father Death:

Anchor Pradeep Machiraju Emotional Words About His Father
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs