Advertisement
Google Ads BL

ఆ హీరోతో నటించాలని ఉందంటున్న సామ్


సమంత అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ద్వారా పాన్ ఇండియాలోకి అడుగుపెట్టింది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ పై బోలెడంత హైప్ ఉంది. దానితో పాటుగా శాకుంతలం అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. రాజి అనే టెర్రరిస్ట్ పాత్రలో డీ గ్లామర్ గా డిఫ్రెంట్ రోల్ ప్లే చేసిన సమంత ఓ బాలీవుడ్ హీరోపై మనసు పారేసుకుంది. అంటే బాలీవుడ్ లో గనక సినిమా చేస్తే.. ఏ హీరో తో నటించాలని అనుకుంటున్నారని సమంత కి ఓ ప్రశ్న ఎదురైంది.

Advertisement
CJ Advs

దానితో సమంత రణబీర్‌ కపూర్‌తో కలిసి నటించాలనుందని చెప్పింది. మరి రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ కి ఉండదు చెప్పండి. అలాగే సమంత కి కూడా రణబీర్ కపూర్ తో నటించాలని ఉందట. ఇక ఫ్యామిలీ మ్యాన్ లో రా ఏజెంట్ పాత్ర పోషించిన మనోజ్‌ బాజ్‌పాయ్‌ పాత్రని తెలుగులో ఏ హీరో చేస్తే బావుంటుంది అని అడగగా.. దానికి సమంత వెంటనే మా మామ నాగార్జున అని చెప్పింది. మరి వైల్డ్ డాగ్ లో నాగార్జున ఫ్యామిలీ మ్యాన్ లో  మనోజ్‌ బాజ్‌పాయ్‌ చేసిన పాత్ర లాంటి పాత్రలో ఏసిపి గా అదరగొట్టేసాడు. అందుకే వెంటనే సామ్ నాగ్ పేరు చెప్పింది. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ జూన్ 4 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. 

Samantha wants to romance Ranbir Kapoor:

Samantha Akkineni Reveals she would like to romance Ranbir Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs