Advertisement
Google Ads BL

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఫన్నీ ఆన్సర్స్


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించాడు. సీజన్ 4  విజేత గా అభిజిత్ అందరి మన్ననలు అందుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటకి రాగానే అభిజిత్ కెరీర్ లో బాగా బిజీ అవుతాడు.. హీరోగా సినిమాలు మొదలు పెడతాడు అనుకున్నారు. కానీ అభిజిత్ మాత్రం, ఇప్పటివరకు ఖాళీగానే ఉన్నాడు. ఆయన తోటి వారు సోహెల్, అఖిల్ లు యూట్యూబ్ ఇంటర్వూస్, కొత్త సినిమాల ఓపెనింగ్స్ తో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసిన అభిజిత్ అభిమానుల ప్రశ్నలకి ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

తన మదర్ కి కరోనా వచ్చింది అని చెప్పిన అభిజిత్.. ఇప్పుడు ఆమె బావుంది అని చెప్పాడు. అలాగే అమ్మకి కరోనా వచ్చిన టైం లో మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరువలేనిది అని అందరికి కృతఙతలు చెప్పాడు అభిజిత్. లాక్ డౌన్ టైం లో చాలా కష్టంగా ఉన్నా.. ఇంటికే పరిమితమవడం వల్ల పాత జ్ఞాపకాలను ఎక్కువగా నెమరువేసుకుంటున్నాను. అయితే తన ఫ్యూచర్ ఏమిటి అని అడిగిన వారికీ చాలా ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఒక పని మాత్రమే చేస్తూ కూర్చొను అని చెబుతున్నాడు.  మీరు చెయ్యబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నాము.. మంచి బ్లాక్ బస్టర్ తో కం బ్యాక్ ఇవ్వాలి అని అడిగిన అభిమానులకు తధాస్తు అని చెప్పిన అభిజిత్.. తన కార్డు నెంబర్ ఏమిటి అని అడిగిన వారికీ 100 అంటూ పోలీస్ ల నెంబర్ చెప్పడం ఫన్నీగా అనిపించింది.

Abhijeet chit chat with fans:

Abhijeet Instagram chit chat with fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs