Advertisement
Google Ads BL

అఖండ హైప్ అలా ఉంది మరి


అన్ని అనుకూలంగా ఉంటే మరో ఐదు రోజుల్లో విడుదలకావల్సిన బాలకృష్ణ - బోయపాటి అఖండ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోతుంది. మరో 15 నుండి 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న అఖండ మూవీ ముందుగా రిలీజ్ చేద్దామనుకున్నా డేట్ మే 28. ఎన్టీఆర్ వర్ధంతి రోజున బాలకృష్ణ BB3 ని విడుదల చేసేందుకు బోయపాటి శతవిధాలా ప్రయత్నించినా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల అనుకున్నది కుదరలేదు. అందుకే మే 28 కి రావాల్సిన అఖండ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్లే. టీం అధికారికంగా ఇంకా  ప్రకటించలేదు కానీ.. మూవీ మాత్రం పక్కాగా మే 28 కి రావడం లేదు. కారణం థియేటర్స్ తెరిచిలేకపోవడం, లాక్ డౌన్ నడుస్తుండడమే .

Advertisement
CJ Advs

అయితే అఖండ మూవీ టీజర్స్ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో సినిమాపై ఏర్పడిన అంచనాలకు సరిపడానే అఖండ మూవీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. థియేటర్స్ క్లోజ్ అవ్వకముందే అఖండ థియేట్రికల్ మరియు డిజిటల్ హక్కులకు సంబంధించే 80 నుంచి 90 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఆ రేంజ్ కి తగ్గ బజ్ సినిమాపై ఉంది. కాబట్టే అంతలాంటి బిజినెస్ జరిగింది అని.. ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడం అఖండ కి పెద్ద విషయం కాదంటున్నారు. BB3 రెండు టీజర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడం.. బోయపాటి - బాలకృష్ణ కాంబోపై ఉన్న క్రేజ్ అన్ని అఖండ కి భారీ బిజినెస్ జరిగేలా చేసింది అంటున్నారు.

Akhanda setting record pre release business:

Balakrishna - Boyapati Akhanda setting record pre release business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs