Advertisement
Google Ads BL

హీరోపై పోలీస్ ల ఓవరేక్షన్


తెలంగాణాలో గత పది రోజులుగా లాక్ డౌన్ అమలులో ఉండగా.. మరోసారి ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ని పొడిగించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో లాక్ డౌన్ సరిగా అమలు చెయ్యడం లేదని.. పోలీస్ లపై విమర్శలు రావడం, లాక్ డౌన్ లో చాలామంది రోడ్ల మీదే తిరుగుతున్నా పోలీస్ లు పట్టించుకోవడం లేదంటూ న్యూస్ ఛానల్స్ లో వస్తున్న వార్తలతో కేసీఆర్ ప్రభుత్వం.. లాక్ డౌన్ పై కఠిన చర్యలు తీసుకోమని పోలీస్ శాఖని ఆదేశించగా.. అప్పటినుండి పోలీస్ ఓవరేక్షన్ మొదలైంది. ఇక గత రెండు రోజులుగా అవసరమైన, అవసరం లేని వారిపై కూడా పోలిస్ లు లాక్ డౌన్ నిబంధలు ఉల్లగిస్తున్నారంటూ.. లాఠీ ఛార్జ్ చెయ్యడం వాహనాలను సీజ్ చెయ్యడం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే గత రాత్రి హీరో నిఖిల్ ఓ పేషేంట్ కోసం ఉప్పల్ నుండి.. సికింద్రాబాద్ హాస్పిటల్ కి మెడిసిన్ తీసుకుని వెళుతుంటే.. పోలీస్ లు నిఖిల్ కారుని ఆపేసి.. లాక్ డౌన్ లో రోడ్ మీదకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించగా.. నిఖిల్ తాను ఓ పేషేంట్ కోసం మెడిసిన్ పట్టుకెళుతున్నట్టుగా, ప్రిస్కిప్షన్ తో పాటుగా, పేషెంట్ వివరాలు చూపించినా వదల్లేదు. లాక్‌డౌన్ సమయంలో ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దానితో నిఖిల్ ఈపాస్ కోసం ప్రయ్నత్నం చెయ్యగా సర్వర్ డౌన్ అని చూపించడంతో. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసాడు నిఖిల్ సిద్దార్థ్.

ఆ ట్వీట్ చూసిన పోలీస్ కమిషనరేట్.. నిఖిల్ కి మీ లొకేషన్ పంపించండి. అక్కడున్న సిబ్బంది ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తామని చెప్పగా నిఖిల్ అలానే చెయ్యడంతో.. తర్వాత నిఖిల్ ని వదిలిపెట్టారట పోలీస్ లు. మరి అలా అత్యవసర సేవలని ఆపి ఇలా ప్రశ్నలతో టైం వెస్ట్ చేయడం వలన పేషేంట్స్ గతి ఏం కాను అంటూ.. పోలీస్ లపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.

Hyderabad Police Stops Hero Nikhil:

Hyderabad police stops tollywood hero Nikhil siddharth at uppal amid lockdown time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs