మాస్టర్ చిత్రంతో అందరి చూపు తన మీదే పడేలా చేసుకుంది మాళవిక మోహన్. మాస్టర్ సినిమాలో మాళవిక ఓ లెక్చరర్ గా.. విజయ్ కి కనువిప్పు కలించే అమ్మాయిలా ఆకట్టుకుంది. అయితే మాస్టర్ సినిమా రిలీజ్ కాకుండానే మాళవిక మోహన్ కి టాలీవుడ్ నుండి కోలీవుడ్ నుండి తెగ ఆఫర్స్ వెళ్లాయి. కానీ మాస్టర్ సినిమా విడుదలయ్యేవరకు మాళవిక మోహన్ ఏ ఆఫర్ ఒప్పుకోలేదు. మాస్టర్ సినిమా విడుదలయ్యాక కూడా మాళవిక ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సారీ లో గ్లామర్ గా ఎలా ఉండాలో మాళవిక ని చూసి నేర్చుకోవచ్చు అనేలా ఆమె సారీ తో పోస్ట్ చేసిన గ్లామర్ లుక్స్ ఉన్నాయి. అయితే తాజాగా మాస్టర్ సినిమాలో నటించడంపై మాళవిక మోహన్ ఈ విధంగా స్పందించింది.
మాస్టర్ లో హీరో విజయ్, సేతుపతిలతో కలిసి నటించడం నా జీవితంలో గొప్ప మైలురాయి. హీరో విజయ్ తో కలిసి పనిచెయ్యడం చాలా థ్రిల్ ని కలగజేసింది. మాస్టర్ లాంటి గొప్ప టీం తో కలిసి పనిచెయ్యడం చాలా ఉత్సాహాన్నిచ్చింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇలా అంతా కలిసి చాలా కాలం మాస్టర్ సినిమా కోసం పని చేసాం. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో భాగం కావడం నిజం నా లక్కే. మరోసారి అదే టీం తో కలసి పని చేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా అంటూ మాళవిక మోహన్ చెప్పుకొచ్చింది.