Advertisement
Google Ads BL

పావలా శ్యామల యూ టర్న్


నిన్నటివరకు పావలా శ్యామల కన్నీటి కష్టల గురించి కరాటే కళ్యాణి పెట్టిన వీడియో ద్వారా ఆమె బాధలను తెలుసుకున్న మెగాస్టార్ చిరు దగ్గరనుండి చాలామంది ఆమెకి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. పావలా శ్యామల ఆరోగ్యం, ఆమె ఆర్ధిక కష్టాలను విని చలించిపోయిన చిరంజీవి ఆమెకి మా లో సభ్యత్వం ఇప్పించడం కోసం  1,01,500 చెక్ ని పంపించారు. మా లో సభ్యత్వం రాగానే ఆమెకి నెల నెల ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పట్లని చిరు చేసారు. అలాగే కరాటే కళ్యాణి పావలా శ్యామల ఆర్ధికకష్టాలను వివరిస్తూ రెండు లక్షలకు పైగా డబ్బు పోగుచేసి పావలా శ్యామలకి అందచేసింది.

Advertisement
CJ Advs

అలాగే నటుడు జీవన్ కుమార్‌ పావలా శ్యామల ఇంటికి వెళ్లి తన వంతు సాయం అందించడమే కాకుండా నిత్యావసరాలతో పాటు ప్రతి రోజు భోజన వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలపడంతో.. చిరంజీవి గారు మా సభ్యత్వం ఇప్పించి ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేసిన.. తన మందులకు నెలకి పది వేల ఖర్చు అవుతుంది అని, అలాగే తాను ఇతరులు వండిన ఆకారాన్ని తినను అని, తాను బ్రాహ్మణ వర్గానికి చెందినదాన్ని కాబట్టి ఇతరులు చేసిన ఆహారం తినని అంటూ చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. కరాటే కళ్యాణి కూడా తనకి ఇంత సహాయం చేస్తున్నాం.. కాని ఆమెకి కృతజ్ఞత లేదు.. తనకి ఎలాంటి హెల్ప్ వద్దు.. కేవలం డబ్బు చాలని చెబుతుంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అయితే తాను చావలేక అడుక్కుంటున్నా అని, తాను చనిపోయినా తన కూతురుకి సహాయం చెయ్యాలని, తన కూతురు తన మీద ఆధారపడి బ్రతుకుతుంది అని, తాను అందుకే బ్రతకాలనుకుంటున్నా అని, చేతనైతే సహాయం చెయ్యండి.. దయచేసి అవమానించకండి. నా హృదయం గాయపడితేనే ఎవర్నైనా అంటా.. గొడవ పడతా.. అంతే తప్ప కావాలని ఎవర్నీ అనను.. అంటూ పావలా శ్యామల యు టర్న్ తీసుకుంది.

Pavala Syamala Sensational Comments On Chiranjeevi:

Karate Kalyani Sensational Comments On Pavala Syamala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs