Advertisement
Google Ads BL

వ్యాక్సిన్ వేయించుకున్న కీర్తి


కరోనా వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ ఏమిటి అనేది కరోనా బారిన పడి కోలుకున్నవారికే బాగా తెలుస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కరోనా సోకినా ప్రమాదం ఉండదని డాక్టర్స్ చెప్పిన వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సెకండ్ వేవ్ ఉగ్రరూపంతో ఒణికిపోయి వ్యాక్సిన్ కోసం పరిగెట్టగా కరోనా వ్యాక్సిన్ సెంటర్స్ లో వ్యాక్సిన్ కొరతతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన దుస్థితి. అయితే చాలామంది సెలబ్రిటీస్ కరోనా వ్యాక్సిన్ వేయించుకుని ఆ ఫొటోస్ ని షేర్ చేస్తున్నారు. ఈ మధ్యన కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విగ్నేష్ శివన్ కొవ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Advertisement
CJ Advs

తాజాగా సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఫోటో ని షేర్ చేసింది. ఉదయం యోగాసనం ఉన్న పిక్ పోస్ట్ చేసి.. డైలీ యోగా, రొటీన్ యోగా అంటూ కామెంట్ పెట్టిన కీర్తి సురేష్ ఈవెనింగ్ కల్లా తాను కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పిక్ ని పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న  ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.

Keerthy Suresh get vaccinated :

Keerthy Suresh takes first jab of Covid-19 vaccine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs