దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో.. ఇప్పుడు ఇండియా వైడ్ గా కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టినా.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే లాక్ డౌన్ పెట్టడంతో కరోనా కేసులు కంట్రోల్ అవడంతో చాలా రాష్ట్రాలు ఆ లాక్ డౌన్ పొడిగిస్తూ పోతున్నాయి. తెలంగాణాలో కేవలం నాలుగు గంటల ఆంక్షల సడలింపు ఉండగా 20 గంటల లాక్ డౌన్ ని కూడా ప్రజలు లెక్క చేయకపోవడంతో పోలీస్ ల తల ప్రాణం తోకకి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చెయ్యాలని పోలీస్ ఉన్నతాధికారులని ఆదేశించింది.
ఇక తమిళనాడులో గత కొన్ని రాజులుగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండంతో ఓ వారం పాటు కఠినంగా అంటే పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవల మినహా తమిళనాడు స్టేట్ లో కంప్లీట్ లాక్ డౌన్ అమలు చెయ్యబోతున్నట్టుగా స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. చాలా తక్కువ సమయమే ఈ వారం ఆంక్షలు సడలింపు ఉంటుంది అని.. మిగతా సమయంలో ప్రజలెవరూ ఇంటి నుండి బయటికి రావొద్దని.. ఈ వారం పూర్తి లాక్ డౌన్ అమలు చెయ్యబోతున్నాట్టుగా ప్రకటించారు. ఇక తెలంగాణాలో నేటి నుండి ఉదయం పది తర్వాత జిల్లా సరిహద్దులను మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.