Advertisement
Google Ads BL

ఆ కోరికని బయట పెట్టిన నాగ్


నాగార్జున ఓ పక్క సినిమాలు, మరోపక్క వ్యాపారాలు అంటూ ఎప్పుడూ బిజినె. కాస్త ఖాళీగా ఉంటే అమలతో కలిసి వెకేషన్స్ కి చెక్కెయ్యడం, ప్రతి వారం ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట చేరి లంచ్ చెయ్యడం లాంటివి చేస్తుంటారు. వైల్డ్ డాగ్ సక్సెస్ తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారుతో ఓ యాక్షన్ మూవీ మొదలు పెట్టాడు. ఆ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు రావడం తర్వాత మూవీ యూనిట్ లేదూ.. జూన్ సెకండ్ వీక్ నుండి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అని అప్ డేట్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా నాగార్జున తన కలల ప్రాజెక్ట్ విషయమై స్పందించారు. అదేదో సినిమా ప్రాజెక్ట్ కాదు. కానీ అంతకన్నా విలువైన ప్రాజెక్ట్ విషయాలను నాగ్ పంచుకున్నారు.

Advertisement
CJ Advs

నాగార్జున కి ఓ డ్రీం ఉంది. అది ఓ సినిమా మ్యూజియం కట్టించాలని. ఆ మ్యూజియం లో పాత సినిమాలు, ఆ పాత సినిమాల్లో వాడిన కాస్ట్యూమ్స్‌, కెమెరాలు, ఇత‌ర సాంకేతిక సామాగ్రి ఇలాంటివ‌న్నీ ఓచోట‌కు చేర్చాల‌న్న‌ది నాగ్ ఆలోచన. అయితే లాక్ డౌన్ కారణముగా అది కాస్త లేట్ అయ్యింది. లేదంటే ఈపాటికే  సినిమా మ్యూజియం రెడీ అయ్యేది. అయితే అందులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాల కాస్ట్యూమ్స్, ఇతర సామాగ్రి ని సేకరించి వాటిని ఆ సినిమా మ్యూజియం లో భద్రపరచాలని నాగ్ ఆలోచన. ఇప్పటికే నాగేశ్వర రావు గారి చాలా సినిమాల కాస్ట్యూమ్స్ సేకరణ పూర్తయినా.. ఇప్పుడా సినిమా మ్యూజియం ఎక్కడ నిర్మించాలనేది ఆలోచిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా నాగ్ చేస్తున్నారట.

Nagarjuna reveals his dream project:

Nagarjuna says It’s my dream to build a museum for Telugu cinema
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs