Advertisement
Google Ads BL

హ్యాట్సాఫ్ శ్రీకాంత్


గత రాత్రి గుండెపోటుతో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో ప్రముఖ పిఆర్వో, ప్రొడ్యూసర్ బిఎ రాజు ఆకస్మికంగా కన్ను మూసిన విషయం తెలిసిందే, ఆయన మరణం సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. బిఎ రాజు మరణానికి చింతిస్తూ మహేష్ బాబు, మెగాస్టార్ చిరు, పవన్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇంకా యంగ్ హీరోలు, ఆయనతో పరిచయం ఉన్న హీరోయిన్స్, బుల్లితెర నటులు, అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక చిన్నప్పటినుండి ఆయనతో సన్నిహిత సంబంధాలు మెయింటింగ్ చేస్తూ.. ఇప్పటివరకు తన సినిమాలకు పీఆర్వో గా వ్యవహరించే బిఏ రాజు మరణంతో మహేష్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యి ఆయన ఆత్మకి శాంతి కలగాలంటూ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే హీరో శ్రీకాంత్ మాత్రం ఇలా ట్వీట్స్ తో సరిపెట్టకుండా బిఏ రాజు మరణాంతరం.. ఆయన అంతిమ ఏర్పాట్ల కోసం దగ్గరుండి ఆయనే అన్ని చూసుకున్నారు. ఫిలిం నగర్ మహాప్రస్థానం లో ఆయన అంతిమ కార్యక్రమాలకు పర్మిషన్ తీసుకోవడం దగ్గరనుండి ఆయన్ని సాగనంపే వరకు అక్కడే ఉండి.. కుటుంబ సభ్యలకు తోడుగా వుండి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. కొంత నగదు రూపంలో ఆర్ధిక సాయం కూడా చేశారు. ఓ సీనియర్ పీఆర్వో మరణాంతరం హీరో శ్రీకాంత్ ఇలా ఆయన విషయంలో చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ శ్రీకాంత్ అంటున్నారు. 

Hat's off Srikanth:

BA Raju condolence Messages
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs