Advertisement
Google Ads BL

బాలీవుడ్ గ్లామర్ గర్ల్.. యాక్షన్ మూవీలో


బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ కూతురు అనే స్థాయి నుండి గ్లామర్ బ్యూటీ సారా అలీ ఖాన్ స్థాయిలో ఉంది ప్రస్తుతం ఆమె స్టార్ డం. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి గ్లామర్ గా ఎక్సపోజింగ్ చేస్తూ అప్పుడప్పుడు వెకేషన్స్ అంటూ మాల్దీవులలో  అన్నతో కలిసి బికినీలతో రచ్చ చేసే సారా అలీ ఖాన్ ఇప్పటివరకు గ్లామర్ పాత్రలనే చేస్తోంది. కానీ ఇప్పుడు సారా అలీ ఖాన్ ఓ భారీ బడ్జెట్ మూవీలో యాక్షన్‌ హంగామా రేడి అవుతుంది. అది కూడా బాలీవుడ్ హ్యాండ్ సం హీరో విక్కీ కౌశల్ తో కలిసి ది ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో సారా అలీ ఖాన్ పాత్ర మాములుగా ఉండదట.

Advertisement
CJ Advs

అంటే ఈసారి గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యమున్న కేరెక్టర్ లో కనిపించబోతుంది. మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రని ఆధారంగా చేసుకొని ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ గా తెరకెక్కుతున్న సారా పాత్రకీ భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయట. అందుకోసమే సారా అలీ ఖాన్  హీరో విక్కీ కౌశల్ తో కలిసి కొన్ని నెలలుగా  గుర్రపు స్వారీతో పాటు విలువిద్య నేర్చుకుంటోందట. ఒకసారి షూటింగ్ మొదలయ్యాక ఓ ఐదు నెలల పాటు ఆగకుండా అంతటి భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తుందట చిత్ర బృందం. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇండియా, అమెరికా, ఐస్‌లాండ్‌ లాంటి దేశాల్లో చిత్రీకరించబోతున్నట్లుగా  తెలుస్తుంది.

Vicky Kaushal and Sara Ali Khan The Immortal Ashwatthama Update:

 Vicky Kaushal and Sara Ali Khan The Immortal Ashwatthama to go on floors in September
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs