రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ బర్త్ డే కి అదిరిపోయే ట్రీట్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి హీరోయిన్ గా సీత కేరెక్టర్ లో అలియా భట్ నటిస్తుంది. అల్లూరిగా రామ్ చరణ్ లుక్, సీతగా అలియా భట్ లుక్స్ విశేషమైన స్పందన వచ్చింది. విడివిడిగా రివీల్ అయిన ఈ లుక్స్ కలిసి కనిపిస్తే ఎలా ఉంటుందో అనే ఆతృతలో మెగా ఫాన్స్ ఉన్నారు. అయితే అదే పెయిర్ మరోసారి జోడి కట్టబోతున్నట్టుగా సోషల్ మీడియాలో న్యూస్.
రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ ని అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉండగా ఆయనపై ఇండియన్ 2 కేసు మొదలవడంతో ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 షూటింగ్ చెయ్యాల్సి వస్తుంది. దానితో రామ్ చరణ్ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యంగా మొదలు కాబోతుంది. అయినా రామ్ చరణ్ కి హీరోయిన్ వేటలో ఉన్నట్లుగా నిర్మాత దిల్ రాజు చెప్పినట్టుగా.. ముందు కియారా అద్వానీ అయితే బావుండు అనుకున్న శంకర్ అండ్ చరణ్ లు ఇప్పుడు అలియా భట్ వైపు మొగ్గు చూపుతున్నారట. మరి ఫైనల్ గా కియారా లేదంటే అలియా భట్ లే రామ్ చరణ్ తో జోడి కడతారని అంటున్నారు.