Advertisement
Google Ads BL

డాక్టర్ బాబు కి నిజం తెలిసిపోయింది


అన్ని సీరియల్స్ ఎలా ఉన్నా మొదలైన నాటినుండి ఇప్పటివరకు అంటే దాదాపు 1000 కి పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని టాప్ టిఆర్పి లో దూసుకుపోతున్న సీరియల్ ఏమిటయ్యా అంటే స్టార్ మా లో రోజూ రాత్రి 7.30 నిమిషాలకి ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్. డాక్టర్ బాబు - వంటలక్క గురించి బుల్లితెర ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీస్ సైతం మాట్లాడుకునే రేంజ్ కార్తీక దీపం సీరియల్ ది. కార్తీక్ దీపని అనుమానంతో వదిలేసి పదేళ్లుగా సాధిస్తూనే ఉన్నాడు. మధ్యలో మోనిత అనే విలన్ కేరెక్టర్, సౌందర్య లాంటి అందమైన మనసున్న అత్తగారు.. చక్కటి ఫ్యామిలీ డ్రామా, కాకపోతే డాక్టర్ బాబు కి అనుమానం జబ్బు. దీప పిల్లలని విహారి అనే రైటర్ కి ద్వారా కనింది అనేది కార్తీక్ అనుమానం.. దానికి విలన్ మోనిత సపోర్ట్.. అంతా మోనిత నాటకం.. కానీ కార్తీక్ కళ్ళు తెరుచుకోడు. 

Advertisement
CJ Advs

ఓ డాక్టర్ అయ్యుండి సిల్లీగా ఆలోచిస్తాడు. అబ్బో గత మూడున్నరేళ్లుగా ఈ డ్రామానే ప్రేక్షకులు తెగ ఇంట్రెస్టింగ్ గా చూసేస్తున్నారు. ఈమధ్యనే కార్తీక్ - దీప కలిసిపోయినట్టుగా చూపించినా దీపకి జబ్బు చేసి చనిపోతుంది అన్న కారణంతో కార్తీక్ వంటలక్కని దగ్గరికి తీసాడు అనే విషయం వారానికే రివీల్ అయ్యింది. దానితో దీప మళ్ళీ ఒంటరి. చివరికి కార్తీక్ దీపకి నిజం చేస్ప్పేస్తాడు.. నువ్వు త్వరలోనే చచ్చిపోతావని. దానితో డాక్టర్ బాబు దగ్గర దీప కన్నీళ్లు, కార్తీక్ మనసు కరిగినా ఎక్కడో ఎదో అనుమానం. మధ్యలో మోనిత కుట్రలు. చివరికి ఆ విహారి అన్న వ్యక్తికి పిల్లలు పుట్టరని తొమ్మిదేళ్ల క్రితమే ఓ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిన విషయాన్ని కార్తీక్ కి తెలియడంతో అతనిలో మార్పు.. మొదటిసారి దీప మీద నమ్మకంతో కన్నీళ్లు. 

ఆఖరికి కార్తీక్ దీప గురించి నిజం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకోవడంతో.. ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా డాక్టర్ బాబుకి నిజం తెలిసి మొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటూ పోస్ట్ చెయ్యడం మరింత ఆసక్తికరంగా మారింది. మంచు లక్ష్మి వాళ్ళ అమ్మ కార్తీక దీపం సీరియల్ మొదలయ్యాక కార్తీక్ కన్నీళ్లు పెట్టుకోవడం చూశారట.. దానితో ఆవిడ హ్యాపీ.. ఆ విషయాన్నీ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. సో డాక్టర్ బాబులో మార్పు నిజమేనా? లేదంటే ఇది కూడా ట్విస్టేనా? అనేది ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల ఆరాటం. 

Karthika Deepam: Karthik with a shocking revelation:

Karthika deepam: Karthik to learn the truth about Deepa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs